దీపికా, అలియాలతో విజయ్‌ దేవరకొండ సందడి

16 Nov, 2019 11:37 IST|Sakshi

‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరో అయ్యాడు  విజయ్‌దేవరకొండ. సినిమాలలో, అడియో రిలీజ్‌ ఫంక‌్షన్‌లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు ఈ ‘గీత గోవిందం’ హీరో. ఇక బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహర్‌ అర్జున్‌రెడ్డిని హీందీలో రీమేక్‌లో నటించమని అడగడంతో విజయ్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్‌ నటించిన డియర్‌ కామ్రేడ్‌ను కూడా కరణ్‌ హీం​దీలో రీమేక్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్‌కి టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ హీరోకి బాలీవుడ్‌లో ఆఫర్‌లు కూడా వస్తున్నాయంటా. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో బీజీగా ఉండటంతో బీటౌన్‌కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ.

తాజాగా ఇంటర్‌నేషనల్‌ సింగర్‌ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్‌ షో కోసం ముంబాయిలోని వన్‌ప్లేస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్‌ జోహర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ పార్టీకి విజయ్‌ దేవరకొండకు కూడా ఆహ్వనం అందింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌, కైరా అద్వానీ, దీపికా పదుకోన్‌, జాక్వేలిన్‌ ఫేర్నాండేస్‌, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ తమిళ హీరో విజయ్‌ సేతుపతి, అర్జున్‌ కపూర్‌, సిధ్దార్థ చతుర్వేది, అభిషేక్‌ బచ్చన్‌లతో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్‌ను అలియా భట్ హాయ్‌ అంటూ పలకరించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న రౌడీ తాజా సినిమా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Vijay deverakonda ❣️ Vijay ❤️ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫_______________ Turn on Post Notification 🔔 _______________⏫_______________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫______________ #arjunreddyfever #arjunreddy😎 #arjunreddy #arjunreddymania #shalinipandey #vijay #vijayfans #vijaydeverakonda # #rowdywear #kajal #rowdies #rowdy #rowdyclub #geethagovindam #NOTA # #ajith #tamil #taxiwaala #teluguactress rajini #dearcomrade #alluarjun #prabhas #samantha #bollywoodactress #tamilactress #kollywoodcinema #thedeverakondafc _________________________________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf @thedeverakonda

A post shared by Vijay Deverakonda🔵 (@thedeverakondaf) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా