‘విజయ్‌ ఆగ్రహం.. మద్దతిచ్చిన టాలీవుడ్‌’

5 May, 2020 08:44 IST|Sakshi

విరాళం అడగడానికి మీరెవరు?

నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి

తప్పుడు వార్తలు రాసిన వెబ్‌సైట్లపై విజయ్‌ ఆగ్రహం​

టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మరోసారి ఫైర్‌ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్న పలు వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్య​క్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సెన్సేషన్‌గా మారింది.  కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. 

అయితే మధ్య తరగతి కుటుంబాలకు విజయ్ చేస్తున్న సాయంపై కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు వార్తలు రాశాయి. విజయ్ దేవరకొండ పేద ప్రజలను అవమానిస్తున్నారని.. వెబ్‌సైట్ పెట్టి సాయం చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని అనేక వార్తలు రాశాయి. అంతేకాకుండా విజయ్‌ ఎందుకు విరాళం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూనే, చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ)కి పోటీగా మిడిల్‌క్లాస్‌ ఫండ్‌ను విజయ్‌ ప్రారంభించారంటూ సదరు వెబ్‌సైట్స్‌ పేర్కొన్నాయి. 

అయితే ఈ వార్తలపై స్పందించిన విజయ్‌ తాను చేస్తున్న సహాయక కార్యక్రమాలపై, ది దేవరకొండ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించాడు. ఇంటర్వ్యూలు, ప్రకటనలు ఇవ్వకపోవడంతోనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఫేక్ వార్తలు రాస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో ఫేక్‌న్యూస్‌ని కాదు.. మంచిని పంచండి అంటూ విజ్ఞప్తి చేశాడు.  

విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్‌ ప్రముఖులు
పలు వెబ్‌సైట్లు తనపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్‌ దేవరకొండ విడుదల చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌ అయింది. విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్లు చేశారు. విజయ్‌కి తాను అండగా నిలుస్తానని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు. మహేశ్‌తో పాటు రానా, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, వంశీపైడిపల్లి, అల్లరి నరేశ్‌, రవితేజ, హరీష్‌ శంకర్, క్రిష్‌‌ తదితరులు విజయ్‌కు బాసటగా నిలుస్తు ట్వీట్లు చేశారు. 

చదవండి:
బుట్టబొమ్మకు పెదవి కలిపిన బుట్టబొమ్మ
ఆర్జీవీ ట్వీట్‌.. మండిపడ్డ సింగర్‌!
‘నీలో ఏమాత్రం మార్పు లేదు’

మరిన్ని వార్తలు