మాస్టర్‌: ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

1 Jan, 2020 08:42 IST|Sakshi

తమిళ నటుడు విజయ్‌ తన అభిమానులకు కొత్త సంవత్సరానికి గానూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన 64వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి హిట్‌ సినిమా ‘మాస్టర్‌’ టైటిల్‌ను విజయ్‌ తన తాజా చిత్రానికి ఎంచుకున్నాడు. ఈ మేరకు సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు మాస్టర్‌ అనే టైటిల్‌ను సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఫస్ట్‌లుక్‌లో మసకగా కనిపిస్తున్న విజయ్‌ ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్టర్‌’ అనే టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా అధికభాగం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో విజయ్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు జోడీగా హీరోయిన్‌ మాళవిక్‌ మోహనన్‌ నటించనున్నారు. ‘మాస్టర్‌’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘మాస్టర్‌’ విజయ్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా విజయ్‌ ద్విపాత్రాభినయం చేసిన బిగిల్‌ బాక్సాఫీస్‌ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇందులో జాకీ ష్రాఫ్‌, నయనతార ముఖ్య పాత్రలు పోషించారు. రూ.300 కోట్లు కలెక్షన్లతో 2019లో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్‌ తమిళ చిత్రంగా ‘బిగిల్‌’ నిలిచింది.

మరిన్ని వార్తలు