కబాలి, బాహుబలి 2 తరువాత ‘అదిరింది’

4 Oct, 2017 15:54 IST|Sakshi

సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సొంత రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు ఎలాగూ వస్తాయి. అదే సమయంలో ఓవర్ సీస్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెడితే భారీ రికార్డ్ లు ఖాయం అని ఫీల్ అవుతున్నారు సినీ ప్రముఖులు. అందుకే మన సినిమాలను ఇతర దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాలకు విదేశాల్లో మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి ప్రముఖ థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్ లోని 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్. దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా చూసేందుకు అవకాశం ఉన్న ఈ థియేటర్లో ప్రదర్శనకు అర్హత సాధించటం భారతీయ చిత్రాలకు అరుదైన ఘనతే.

ఇప్పటి వరకు మన దేశం నుంచి కబాలి, బాహుబలి 2 చిత్రాలను మాత్రమే ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా మెర్సల్ ను పారిస్ 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ లో ప్రదర్శించనున్నారట. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అదే రోజు రెక్స్ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో అదే రోజు రిలీజ్ అవుతోంది.

మరిన్ని వార్తలు