మ్యాచ్‌ టైమ్‌ ఫిక్స్‌

5 Jan, 2019 05:40 IST|Sakshi

ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్నారట తమిళ హీరో విజయ్‌. అట్లీ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. ఈ సినిమాలో మహిళల ఫుట్‌బాల్‌ టీమ్‌కి విజయ్‌ కోచ్‌గా నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ కోసం లాస్‌ ఏంజిల్స్‌లో లొకేషన్స్‌ని సెలెక్ట్‌ చేశారు టీమ్‌. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 20న స్టార్ట్‌ కానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలోని 16 మంది ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌గా 16 మంది కొత్తమ్మాయిలను పరిచయం చేయనుండటం విశేషం. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదలవుతుంది.

మరిన్ని వార్తలు