వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్‌’!

8 Nov, 2018 10:39 IST|Sakshi

ఇళయ దళపతి విజయ్‌ సినిమా అంటేనే బాక్సాఫీస్‌లు బయపడుతుంటాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ ఈ మంగళవారం ‘సర్కార్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్‌ మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను తన అభిమానులకు అందించిన విజయ్‌.. ఈ సారి సర్కార్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. 

ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్‌ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్‌పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్‌ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా