రైతులకు లాభం

19 Oct, 2019 02:20 IST|Sakshi
విజయ్‌ సేతుపతి

రైతు సమస్యల నేపథ్యంలో విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘లాభం’. ఈ చిత్రాన్ని ఆరుముగ కుమార్‌తో కలిసి నిర్మించారు విజయ్‌ సేతుపతి. ఇందులో రైతు సంఘం నాయకుడిగా నటించారాయన. ఈ సినిమా కోసం తమిళనాడులోని పెరువాయల్‌ అనే గ్రామంలో రైతు సంఘం భవంతిని నిర్మించారు. సెట్‌ వేద్దామని దర్శకుడు ఎస్‌.పి. జననాథన్‌ అన్నప్పటికీ, షూటింగ్‌ పూర్తయ్యాక రైతులకు ఉపయోగపడాలని నిజమైన బిల్డింగ్‌నే కట్టించారు. ఈ బిల్డింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ పూర్తయ్యాక ముందు అనుకున్నట్లుగానే రైతు సంఘానికి ఆ భవంతిని బహుమతిగా ఇచ్చారు. శ్రుతీహాసన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా