విద్యార్థినికి విజయ్‌సేతుపతి చేయూత

23 Jun, 2019 10:56 IST|Sakshi

పెరంబూరు: ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వడంలోనూ సేవ ఉంటుంది. అలాంటి ప్రతిభను గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. అలా చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించే చాలా కొద్దిమందిలో నటుడు విజయ్‌సేతుపతి ఒకరు. పలువురికి ఆర్థిక సాయం చేసిన ఈయన తాజాగా మరో విద్యార్థినికి సాయం అందించారు. ఈ వివరాలు చూస్తే.. తేని జిల్లా, అల్లినగరానికి చెందిన ఉదయకీర్తిక ప్రభుత్వ పాఠశాలలో తమిళం ప్రధాన సబ్జెట్‌గా చదివింది.

అనంతరం ఏయిర్‌ క్రాప్ట్‌మెయిన్‌టైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యను ఉక్నైన్, కార్గిల్‌లోని నేషనల్‌ యూనివర్సిటీలో అభ్యసించింది. ఇందులో 92,5 మార్కులతో ఏ గ్రేడ్‌లో ఉత్రీర్ణతను సాధించింది. 2022లో ఇండియన్‌ ఇస్రో ద్వారా అంతరిక్ష యానం చేసే టీమ్‌లో స్థానం సంపాధించడమే ధ్యేయంగా విద్యార్థిని నిర్ణయించుకుంది. ఈమెకు పోలాండ్‌ దేశంలో అంతరిక్ష అనలాగ్‌ ఆస్ట్రోనైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లోని అంతరిక్ష విజ్ఞాణిగా శిక్షణ పొందడానికి స్థానం లభించింది. అయితే అక్కడ శిక్షణ రుసుం, బస చేయడానికి, విమాన ఖర్చులు రూ.8 లక్షలు అవసరం అవుతుంది. ఈ విషయం తెలిసిన నటుడు విజయ్‌సేతుపతి ఉదయకీర్తిక శిక్షణకు అయ్యే రూ.8 లక్షలను సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ మొత్తాన్ని తన అభిమాన సంఘ నిర్వాహకుల ద్వారా శనివారం ఉదయకీర్తికకు అందజేశారు. విజయ్‌సేతుపతి షూటింగ్‌లో ఉండడంతో ఆమెను ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.

మరిన్ని వార్తలు