ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

10 Aug, 2019 06:11 IST|Sakshi

సినిమా: నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించిన ఆ చిత్రం వ్యవహారంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ చిత్రం ఏదనేగా మీ ఆసక్తి. శ్రీలంక లెజెండరీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోగ్రపిను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మురళీధరన్‌ పాత్రలో నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి అంగీకరించారు. 800 వికెట్లను తీసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధన్‌ బయోపిక్‌కు 800 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి విజయ్‌సేతుపతి ఇంతకు ముందు మాట్లాడుతూ 800 వికెట్లను తీసి రికార్డు సృష్టించిన ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో నటించడం ఘనతగా పేర్కొన్నారు. అయితే ఆయన ఆ పాత్రలో నటించనుండటంపై తీవ్ర విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి. వీసీకే పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఇటీవల ఒక ప్రకటను విడుదల చేస్తూ శ్రీలంకలోని కండిలో పుట్టిన తమిళుడు అయినా సింహళుడిగానే పెరిగారన్నారు. ఎల్‌టీటీఈ పోరాటంలో ఆయన శ్రీలంకకు మద్దతుగా నిలిచి ద్రోహం చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి పాత్రలో విజయ్‌సేతుపతి నటించడాన్ని శ్రీలంక తమిళులు అంగీకరించరని అన్నారు. ఇదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో విజయ్‌సేతుపతి పోషించనుండటాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాదు విదేశాల్లోని తమిళులు విజయ్‌సేతుపతి ఆ పాత్రలో నటించకూడదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పునరాలోచనలో పడ్డ విజయ్‌సేతుపతి ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో నటించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఆయన ఇంకా బహిరంగంగా వెల్లడించలేదన్నది గమనార్హం. దీంతో 800 చిత్రం తెరకెక్కుతుందా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీని గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌