‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

1 Apr, 2020 13:23 IST|Sakshi

మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తమిళహీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, రెండు పాటలు మెగా అభిమానులకు తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. చేతిలో సిగరెట్‌ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్‌ సేతుపలి మాస్‌లుక్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘రాయనం' అనే విచిత్రమైన పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా