మళ్లీ నటించాలనే..

21 Jul, 2016 02:13 IST|Sakshi
మళ్లీ నటించాలనే..

చెన్నై 28 చిన్న చిత్రాల్లో 2004లో ట్రెండ్ సెట్టర్ చిత్రం ఇది. అనూహ్య విజయంతో పాటు చాలా మంది నూతన కళాకారులకు సినీ జీవితాన్నిచ్చిన చిత్రం. స్ట్రీట్ క్రికెట్‌ను తెరపై అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రం చెన్నై 28. ఆ చిత్రంతో వెండితెరపై ఆవిష్కృతమైన తారల్లో నటి విజయలక్ష్మి ఒకరు. పక్కింటి పరువాల అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అచ్చ తమిళ బ్యూటీ ఆ తరువాత చాలా చిత్రాల్లో నాయకిగా నటించారు.
 
 అంతే కాదు ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనకు జంటగా సుత్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రంలో నటించారు. దురదృష్టవశాత్తు ఆ చిత్రం పూర్తి కాలేదు గానీ లేకుంటే విజయలక్ష్మి మరో స్థాయికి చేరి ఉండేవారు. నటిగా తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ నటనకు కొంత కాలం దూరం అయ్యారు. ఆ తరువాత దర్శకుడు వెంకట్‌ప్రభు చెన్నై 28కు సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి భాగంలో నటించిన తారలే నటిస్తారని ప్రకటించారు.
 
 అయితే పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉన్న విజయలక్ష్మి చెన్నై 28 రెండో భాగంలో నటిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది.అయితే దర్శకుడు వెంకట్‌ప్రభు ఆమెనే నటింపజేయడంలో సఫలీకృతుడయ్యారు.చిన్న గ్యాప్ తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నా నటి విజయలక్ష్మిని చెన్నై 28 సీక్వెల్‌లో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటిగా మరుప్రవేశం చేయాలన్న నిర్ణయమేనని బదులిచ్చారు. అయితే చాలా కాలంగా బుల్లితెరలో చేస్తున్న యాంకరింగ్‌ను మానుకోనని అన్నారు.చెన్నై 28కు సీక్వెల్‌లో నటించడం ఆనందంగా ఉందన్నారు. పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
  చిత్రంలో ఎక్కువ, తక్కువ కాకండా మాట్లాడతానేమో గానీ షూటింగ్ సెట్‌లో కో ఆర్టిస్టులతో జోకుల వేస్తూ చాలా సరదాగా గడిపేస్తానన్నారు. ఒక షూటింగ్‌లా కాకుండా కుటుంబ సభ్యులతో పిక్నిక్‌కు వెళ్లినట్లు చాలా జాలీగా చెన్నై 28 సీక్వెల్ షూటింగ్ సెట్‌లో గడిపామన్నారు. విజయలక్ష్మి ఇటీవల నిర్మాతగా మారి తన భర్త ఫరోజ్ దర్శకత్వంలో పండిగై అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణం అన్నది బాధ్యతతో కూడినది అయినా తాను అందులోనూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానని అన్నారు.