కథకు ప్లస్‌ అయ్యే క్యారెక్టర్సే ఇష్టం

8 Jul, 2018 00:30 IST|Sakshi
మాళవికా నాయర్‌

‘‘నేను ఇప్పటి వరకు చేసిన ప్రతీ క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే, మహానటి’ ఇలా సినిమా సినిమాకు డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. సినిమాలో నా పాత్ర వల్ల కథకు ప్లస్‌ అవ్వాలని కోరుకుంటాను. అందుకే క్యారెక్టర్స్‌ ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అని మాళవికా నాయర్‌ అన్నారు. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాకేశ్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందించిన చిత్రం ‘విజేత’.

ఇందులో మాళవికా నాయర్‌ కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ– ‘‘విజేత’ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. చేసే పనిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్న క్యారెక్టర్‌. నా పాత్రకు కంప్లీట్‌ అపోజిట్‌గా కల్యాణ్‌ పాత్ర ఉంటుంది. జులాయిగా, ఏ లక్ష్యం లేకుండా తిరుగుతుంటాడు. కల్యాణ్‌ దేవ్‌ చాలా హానెస్ట్‌. సింపుల్‌గా ఉంటాడు. శ్రీజ సెట్స్‌కి వచ్చేవారు. జనరల్‌గా నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటాను.

కానీ ఈ సినిమాలో చెప్పుకోవడం కుదరలేదు. ఫ్యూచర్‌లో నా గొంతే వినపించడానికి ట్రై చేస్తాను. నా పదో తరగతి నుంచే యాక్ట్‌ చేస్తున్నాను. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నాను. మూవీస్‌ను, స్టడీస్‌ను బాలెన్స్‌ చేస్తున్నాను. స్విమ్మింగ్‌ బాగా చేస్తాను. మా కాలేజ్‌ తరఫున స్విమ్మింగ్‌ ప్లేయర్‌ని. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్‌ మొదటి భార్య అలమేలుగా నటించాను. పాత్ర చాలా చిన్నది, డైలాగ్స్‌ కూడా చాలా తక్కువ ఉంటాయి.

అయినా  సావిత్రి గారి బయోపిక్‌కు నో అని ఎవరు చెప్తారు? ఆల్రెడీ నాగ్‌ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేయడం కూడా ఓ కారణం. హీరోయిన్స్‌లో నేను రోల్‌ మోడల్‌గా ఫీల్‌ అయ్యేది మలయాళ నటి పార్వతిని. క్యారెక్టర్‌ క్యారెక్టర్‌కి తను భలే మారిపోతుంది. చేసే ప్రతి పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని, రీసెర్చ్‌ చేసి చేస్తుంది. ‘మహానటి’ సినిమాలో ‘అలమేలు’ పాత్రకు నేను కూడా బాగా రీసెర్చ్‌ చేశాను. విజయ్‌ దేవరకొండతో యాక్ట్‌ చేసిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు