ఇక నాన్‌ స్టాప్‌గా..

29 Jul, 2017 00:38 IST|Sakshi
ఇక నాన్‌ స్టాప్‌గా..

ఇప్పుడు మాంచి కమర్షియల్‌ కథల కోసం విక్రమ్‌ ఎదురు చూస్తున్నారు. కథ నచ్చితే చాలు... కొత్త, పాత తేడాలు లేకుండా దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే... వాళ్లకు రెండు కండిషన్లు పెడుతున్నారట! అవేంటంటే? ఒకటి... కమర్షియల్‌ కథలో ఏదొక కొత్త పాయింట్‌ ఉండాలి. రెండు... సినిమాను వీలైనంత త్వరగా నాలుగైదు నెలల్లో కంప్లీట్‌ చేయాలి. ఎందుకంటే... శంకర్‌ ‘ఐ’కు రెండేళ్లు తీసుకోవడంతో ఆ సిన్మా విడుదల తర్వాత ఏడాదికి రెండేసి సినిమాలు చేయాలనుకున్నారు. కానీ, గతేడాది ఒక్క సినిమానే విడుదల చేయగలిగారు. సో, స్పీడుగా కొత్త కాన్సెప్టులతో కమర్షియల్‌ సినిమాలు తీసే దర్శకుల కోసం చూస్తున్నారు.

ఈ టైమ్‌లో కేవీ ఆనంద్‌ చెప్పిన కథకు విక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చెన్నై కోడంబాక్కమ్‌ టాక్‌. ‘వీడొక్కడే, రంగం, బ్రదర్స్, అనేకుడు’ వంటి డబ్బింగ్‌ సిన్మాలతో ఈ దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన కథలెలా ఉంటాయో తెలుసు కదా! సో, అపరిచితుడుతో ఈ ‘రంగం’ దర్శకుడు సినిమా చేయొచ్చు. ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలసి సినిమా చేయకపోవడంతో ఈ కాంబినేషన్‌పై అందరిలో క్రేజ్‌ ఏర్పడింది!!