డైవర్స్ తర్వాత చనిపోవాలనుకున్నా..విక్రమ్ భట్

1 May, 2017 20:44 IST|Sakshi
డైవర్స్ తర్వాత చనిపోవాలనుకున్నా..విక్రమ్ భట్

ముంబై :
ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ తన జీవితంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన పెళ్లి, విడాకులు, ఇతరులతో కొనసాగించి అఫైర్స్పై తనదైన శైలిలో ప్రస్తావించాడు. ఏదో ఒక సింగిల్ రిలేషన్ షిప్ తనను శిథిలం చేయలేదని పేర్కొన్నాడు. తన జీవితమే శిథిలాల సమూహం కంటే పెద్దదిగా అభివర్ణించాడు. తన చిన్ననాటి నుంచి ఎంతగానో ఇష్టపడ్డ అధితిని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు విక్రమ్ భట్. కానీ, నటి సుస్మితా సేన్తో కొనసాగించిన వివాహేతర సంబంధం అధితిని అతని నుంచి దూరం చేసింది. తన భార్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత విక్రమ్ భట్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, కూతురును వదిలేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

'అదంతా సుస్మితా సేన్ వల్ల జరగలేదు. నా జీవితంలో నాకు నేనుగా చేసుకున్న అతిపెద్ద తప్పులు అవి. నేను డైవర్స్ తీసుకున్నా, అప్పుడే నా చిత్రం గులాం విడుదలైంది. నేను కేవలం సుస్మితా సేన్ బోయ్ ఫ్రెండ్ని మాత్రమే. అధితితో డైవర్స్ తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా కూతురుని మిస్సయ్యాను. నా జీవితాన్ని గందరగోళంగా చేసుకున్నాను. నా తప్పిదాలతో వాళ్లు ఎంతగానో బాధ అనుభవించారు' అంటూ తను చేసిన తప్పులపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు విక్రమ్ భట్.

నీకు ధైర్యం లేకపోతేనే, మోసగాడిగా మారుతావని బలంగా నమ్మేవాడిని నేను. నేనెలా బాధపడ్డానో అధితికి చెప్పడానికి ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. గజిబిజిగా జరిగిన పరిణామాలు మా ఇద్దరిని దూరం చేశాయి. ఆ సమయంలో నేను చాలా వీక్గా ఉన్నందుకు చింతిస్తున్నా. ప్రస్తుతం పరిణామాలు చాలా మారాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో చేసిన ప్రతి తప్పు ఓ గుణ పాఠాన్ని నేర్పించిందని విక్రమ్ భట్ చెప్పారు.

విక్రమ్ భట్ విడుదల చేసిన 'ఏ హ్యాండ్ఫుల్ సన్ షైన్' నవల వీర్, మీరా అనే క్యారెక్టర్ల చుట్టు తిరుగుతుంది. ఇద్దరూ ఎంతగా ఇష్టపడి ప్రేమించుకున్న వ్యక్తులు ఓ కారణంతో విడిపోతారు. అయితే అతని నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ నవలలో సుస్మితా సేన్, అమీషా పటేల్ గురించి ఏమీలేదన్నారు. సుస్మితాసేన్, అమిషాపటేల్లతో కొనసాగించిన ప్రేమయాణంపై పెదవి విప్పాడు.  వాళ్లు నాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి అందరికీ బాగా తెలిసిన విషయం కావొచ్చు. కానీ, వాళ్లు కేవలం తాత్కాలికం మాత్రమే. వాళ్లను ఏరోజు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని విక్రమ్ భట్ వ్యాఖ్యానించారు.

>