పదో నెలలో పది!

27 Sep, 2017 02:04 IST|Sakshi

విక్రమ్, సమంత జంటగా విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్‌ మూవీ ‘10 ఎన్రదు కుళ్ల్ల’. అంటే... పది లెక్కపెట్టే లోపు అని అర్థం. ఫాక్స్‌స్టార్, ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జి. సుబ్రమణ్యం, ఎమ్‌. సుబ్బారెడ్డి, చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని ‘10’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తాం. డబ్బింగ్‌ వర్క్స్‌ కంప్లీట్‌ చేసి, అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఛార్మి, పశుపతి, రాహుల్‌ దేవ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్‌.

మరిన్ని వార్తలు