‘ఆయన లేకుంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు’

8 Nov, 2019 21:02 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ద్రువ్‌ విక్రమ్‌ తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘అదిత్య వర్మ’తో వెండితెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ద్రువ్‌తో కలిసి సినిమాను ప్రమోట్‌ చేయడంలో విక్రమ్‌ కూడా బీజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదిత్య వర్మ’  ద్రువ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ద్రువ్‌ సినిమా కెరీర్‌కు అదిత్య వర్మ సరైన చిత్రం అన్నారు. తెలుగు అర్జున్‌ రెడ్డి చుశానని అది నాకు బాగా నచ్చిందని, ఈ సినిమా పలు బాషాల్లో రీమేక్‌ అవ్వడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే నిర్మాత ముఖేష్‌ మెహతా అర్జున్‌ రెడ్డి మిళ రీమేక్‌కు ద్రువ్‌ను ఎంచుకున్నారని విక్రమ్‌ అన్నారు.

ఇక గిరిసయ్య దర్శకత్వం వహిస్తున్న అదిత్య వర్మ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నవంబర్‌ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ ప్రీతి పాత్రలో బనితా సింధు అదిత్య వర్మతో తమిళ తెరంగేట్రం చేయగా, ప్రియానంద్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కాగా గత నెలలో జరిగిన అదిత్య వర్మ అడియో లాంచ్‌లో ద్రువ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తాను నటించడానికి మా నాన్న విక్రమ్‌ చాలా శ్రమించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే  ‘నా తండ్రి అంకితాభావం ఉన్న నటుడని నాకు తెలుసు, మా నాన్న ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రోత్సహం, ప్రమేయం లేకుంటే  ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని’ అన్నాడు.

మరిన్ని వార్తలు