మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో

3 Dec, 2019 12:29 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు, 'ఏ డెత్ ఇన్ ది గంజ్' ఫేం విక్రాంత్ మాసే తన పెళ్లి విషయంలో వస్తన్న వదంతులపై క్లారిటీ ఇచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు షీతల్‌ ఠాకూర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేగాక తాజాగా వీరు గత నెలలో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారనే వార్తలు బీటౌన్‌లో బాగానే వినిపించాయి. వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రాంత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వివాహం ఎప్పుడన్న విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అవును మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీని గురించి ఇప్పుడు ఏం చెప్పలేను. సరైన సమయంలో మాట్లాడాలి అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇక విక్రాంత్‌, షీతల్‌ బుల్లితెరపై ప్రసారమైన ‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటీఫుల్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌-1లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను సోషల్‌ మీడియాలో  షేర్‌ చేస్తూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొన్‌ నటించిన ‘చపాక్‌’ సినియాలో విక్రాంత్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఈ చిత్రం 2020 జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Happy happy birthday to the light of my life♥️

A post shared by Sheetal Thakur (@sheetalthakur) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా