వినోద విహార రామ

2 Dec, 2018 03:08 IST|Sakshi
‘వినయ విధేయ రామ’లో ఓ దృశ్యం

కొణిదెల రామ్‌. నలుగురు అన్నయ్యలు. నలుగురు వదినలు. కుటుంబం సభ్యులతో వినయంగా, వినోదంగా ఉంటాడు. తన వాళ్ల జోలికొస్తే విధ్వంసం సృష్టిస్తాడు. ఇలాంటి షేడ్స్‌ ఉన్న పాత్రనే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో పోషిస్తున్నారు రామ్‌చరణ్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా జంటగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పేరు కొణిదెల రామ్‌. ఇందులోని ఫ్యామిలీ సాంగ్‌ ‘తందానే తందానే’ను సోమవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ ఫ్యామిలీ సాంగ్‌తో పాటు ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఆ రెండూ పూర్తి అయితే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు చిత్రబృందం. సంక్రాంతికి కానుకగా జనవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.

మరిన్ని వార్తలు