క‌రోనా రాకుండా బంగ్లాను క‌ప్పేసిన హీరో?

21 Jul, 2020 14:10 IST|Sakshi

ముంబై: దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ఆది నుంచీ ముందు వ‌రుస‌లోనే ఉంది. ముఖ్యంగా ముంబైలో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలో అక్క‌డే సెటిలైన‌ కొంద‌రు సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ షారుక్‌ ఖాన్ త‌న మ‌న్న‌త్ బంగ్లాను ప్లాస్టిక్‌తో క‌ప్పేశారంటూ ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. పైగా క‌రోనా గాలి ద్వారా కూడా వ‌స్తుందంటున్నారు కాబ‌ట్టి ముందు జాగ్ర‌త్త తీసుకున్నారేమోన‌ని ఆయ‌న అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్‌)

నిజంగానే ఆ ఫొటోలో క‌నిపిస్తుంది షారుక్‌ నివాస‌మే.. అయితే ఇది క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డి కోసం తీసుకున్న నిర్ణ‌యం మాత్రం కాదు. ముంబైలో కుండ‌పోత‌గా కురిసే వ‌ర్షాల నుంచి ర‌క్షించుకునేందుకు ఆయ‌న త‌న ఇంటిని ప్లాస్టిక్ క‌వ‌ర్స్‌తో క‌ప్పివేసిన‌ప్ప‌టి చిత్రాలు. ఆయ‌న ప్ర‌తి ఏడాది త‌న బంగ్లాను ఇలా వ‌ర్షాకాలంలో క‌ప్పివేస్తుంటారు. కాగా లాక్‌డౌన్ ప్రారంభ‌మైన నాటి నుంచి షారుక్‌ త‌న భార్య గౌరీ ఖాన్‌, పిల్ల‌లు అబ్‌రామ్‌, సుహానా, ఆర్య‌న్‌లతో క‌లిసి మ‌న్న‌త్ బంగ్లాలోనే నివ‌సిస్తున్నారు. 2018లో వ‌చ్చిన "జీరో" సినిమాలో ఆయ‌న చివ‌రిసారిగా క‌నిపించారు. (ప్రేమే ముఖ్యం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా