విరుష్క...మరో హాట్‌ టాపిక్‌!

15 Dec, 2017 09:20 IST|Sakshi


సాక్షి,  ముంబై:  నిన్నటిదాకా విరుష్క పెళ్లి  హాట్‌ టాపిక్‌. ఇపుడిక కొత్త జంట విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రిసెప్షన్‌ ఎక్కడజరుగుతోంది అని. ఈ నేపథ్యంలో  ప్రస్తుతం వీరి రిసెప్షన్‌  కార్డు  నెట్‌ లో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో విరుష్క వెడ్డింగ్‌ కార్డ్‌ మిస్‌ అయ్యామని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌ దీంతో ఫుల్‌ ఖుషీ. మరోవైపు ప్రముఖ  కండోమ్‌ తయారీ కంపెనీ ఈ  స్టార్‌ కపుల్‌కు విషెస్‌ తెలుపుతూ ట్విట్‌ చేయడం ఆసక్తికరంగామారింది.


 డిసెంబర్‌ నెల 21న ఢిల్లీలో తాజ్‌ డిప్లొమాటిక్‌ ఎంక్లేవ్‌లో బంధువులకు 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు  గ్రాండ్‌ రిసెప్షన్‌ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆహ్వానితులకు ఇన్విటేషన్లు కూడా అందాయి.  దీంతో  చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్‌ ద్వారా ఈ కొత్త జంటకు విషెస్‌ పోస్ట్‌  చేస్తున్నారు.  ముఖ్యంగా ఆహ్వాన పత్రికను డైరెక్టర్ మహేశ్‌ భట్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌  చేశారు. వేల రూపాయల విలువైన రిసెప్షన్‌ కార్డుతోపాటు అతిథులను ఆహ్వానించే సమయంలో మరో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది కొత్త జంట. విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతోపాటు ఓ మొక్కను కూడా జతచేశారు.. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని పేపర్‌బ్యాగులో ఆ మొక్కని పెట్టి కార్డుతో అందిస్తున్నారట.

 ప్రముఖ కండోమ్‌  కంపెనీ డ్యూరెక్స్‌ ఇండియా  విరాట్‌-కోహ్లీలకు అభినందనలు తెలుపుతూ  ట్వీట్‌ చేయడం విశేషం. దీంతో  బిప్స్‌- జాన్‌ అబ్రహం  కండోమ్‌ యాడ్‌ను గుర్తు చేసుకుంటున్నారట అభిమానులు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా