అభిమన్యుడు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను

27 May, 2018 00:18 IST|Sakshi
విశాల్, సమంత, అర్జున్, అమర్, హరి

విశాల్‌

విశాల్, సమంత జంటగా అర్జున్‌ ముఖ్య పాత్రల్లో పీయస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇరంబుదురై’. తెలుగులో ‘అభిమన్యుడు’. యం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి. హరి తెలుగులో జూన్‌ 1న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్‌ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు.
► నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘ఇరంబుదురై’ నిలించింది. తమిళంలో సక్సెస్‌ సాధించినట్టే ఇక్కడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. సోషల్‌ మెసేజ్‌ ఉన్న కమర్షియల్‌ సినిమా ‘అభిమన్యుడు’. తమిళంతో పాటుగా తెలుగులోనూ రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం. మే 11న చాలా తెలుగు సినిమాలు ఉండటంతో రిలీజ్‌ చేయలేకపోయాం.

► నా సినిమా జీవితం అర్జున్‌ గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ అయింది. ఆయనతో కలిసి యాక్ట్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హీరో విలన్‌ మధ్య పోటీ చక్కగా కుదిరింది. మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇందులో అర్జున్‌గారు పలికే సంభాషణలే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నాయి.

► ‘అభిమన్యుడు’ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్మీ వాళ్లకు రేషన్‌ కార్డ్‌ ఉండదు. రైతులకు బ్యాంక్‌ లోన్‌లు ఇవ్వరు అనే విషయాలు తెలిశాయి. ఇలాంటి విషయాలు సినిమాలో డైలాగుల రూపంలో పెట్టాం.

► అందరూ డిజిటల్‌ ఇండియా, ఆధార్‌ కార్డ్‌ అంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిమాణాలు ఉంటాయి అని ఈ సినిమాలో చూపించాం. డిజిటల్‌ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ఎండ్‌ చేశాం. పార్ట్‌ 2 కూడా రూపొందిస్తాం.

► టీమ్‌ అంతా బాగా కుదిరింది. సమంతతో యాక్ట్‌ చేయడం ఫస్ట్‌ టైమ్‌. మంచి కో–స్టార్‌. కెమెరా జార్జ్‌ సీ విలియమ్స్, సంగీతం యువన్‌ శంకర్‌ రాజా అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. అందరం దర్శకుడిని నమ్మాం.

► సినిమా రిలీజ్‌కు ముందు టెస్ట్‌ స్క్రీనింగ్‌ చేశాం. బయటవాళ్ళ అభిప్రాయాలను తీసుకొని నాలుగుసార్లు ఎడిట్‌ చేశాం. బయటవారి ఒపీనియన్‌ తీసుకోవడం మంచిదని తెలిసింది.

► క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్పు చేయాలనే ఆలోచన మానుకుంటారు. సినిమా అనేది స్ట్రాంగ్‌ మీడియం. సోషల్‌ అవేర్‌నెస్‌ సినిమాలు రూపొందించాలి అని మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి.

► నెక్ట్స్‌ ‘టెంపర్‌’ రీమేక్‌లో యాక్ట్‌ చేస్తున్నాను. కొత్త స్క్రీన్‌ప్లేతో చేయబోతున్నాం. మురగదాస్‌ అసిస్టెంట్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తారు.


‘అభిమన్యుడు’ మూవీ రిలీజ్‌ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  డైరెక్టర్‌ మిత్రన్‌ మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా ఇది నా ఫస్ట్‌ సినిమా. డిజిటలైజేషన్‌కి మరో వైపు ఎలా ఉంటుందో అని ఇందులో చూపించాం. సినిమా అనేది స్ట్రాంగ్‌ మీడియం. పాటనో ఫైట్‌నో కాకుండా సమాజంలో జరిగే విషయాల్ని ఈ సినిమాలో చూపించాం.పెళ్లైన హీరోయిన్‌ నటించకూడదు అనే విషయాన్ని దాటి సమంత సక్సెస్‌ కొట్టారు’’అన్నారు. ‘‘రంగస్థలం, మహానటి’ తర్వాత తమిళంలో ‘ఇరంబుదురై’తో సక్సెస్‌ అందుకున్నాను.

ఇన్‌ఫర్మేషన్‌ థెప్ట్‌ గురించిన అవేర్‌నెస్‌ను కలిగిస్తూ కమర్షియల్‌ పంథాలో రూపొందించాం. తెలుగులోను సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమాలో గ్రే షేడ్స్‌ ఉన్న పాత్రను పోషించాను. చాలా స్టైలిష్‌గా నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలానికి టైలర్‌ మేడ్‌ మూవీ ఇది. మిత్రన్‌ ఫస్ట్‌ సినిమా అయినా చక్కగా తెరకెక్కించారు. అభిమన్యుడు మహాభారతంలో అల్టిమేట్‌ హీరో. అలాగే అన్‌సక్సెస్‌ఫుల్‌ హీరో. కానీ మా అభిమన్యుడు సక్సెస్‌ఫుల్‌ హీరో’’ అన్నారు అర్జున్‌. ఈ సినిమాకు సంగీతం:యువన్‌ శంకర్‌ రాజా.

మరిన్ని వార్తలు