రిలీజైన ‘అభిమన్యుడు’ ప్రోమోలు

26 May, 2018 19:13 IST|Sakshi

మాస్‌ ఇమేజ్‌తో తమిళ నాట దూసుకుపోతున్న హీరో విశాల్‌. ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలను చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గతేడాది వచ్చిన డిటెక్టివ్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఈ మధ్యే తమిళనాట విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘ఇరుంబుదురై’. సైబర్‌ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.

తెలుగులో ఈ సినిమా ‘అభిమన్యుడు’గా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు చిత్రయూనిట్‌. విశాల్‌, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రతినాయకుడిగా పాత్రను పోషిస్తున్నారు. విశాల్‌, అర్జున్‌ మధ్య జరిగే సీన్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా జూన్‌ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు