జూన్‌ 1న విశాల్‌ ‘అభిమన్యుడు’ 

22 May, 2018 09:10 IST|Sakshi

‘ఇరుంబుదురై’ అంటూ ప్రస్తుతం తమిళ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు విశాల్‌.  ఈ సినిమా విడుదలైన రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా ఎ‍ప్పుడో రిలీజ్‌ కావల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.

విశాల్‌ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉండడం, సమంత హీరోయిన్‌గా నటించడం వల్ల అభిమన్యుడు సినిమాను పెద్ద ఎత్తులో జూన్‌ 1న రిలీజ్‌ చేయబోతున్నారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి  పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం విశాల్‌ ‘పందెంకోడి 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత తెలుగు ‘టెంపర్‌’ రీమేక్‌లో నటించనున్నారు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు