విశాల్‌ రియల్‌ లైఫ్‌లో కూడా హీరోనే..

9 Jun, 2018 19:29 IST|Sakshi

విశాల్‌ సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా హీరోనే. నుటుడిగా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేస్తున్నారు. విశాల్‌ హీరోగా గత వారం రిలీజైన అభిమన్యుడు సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. విశాల్‌ గత సినిమాలకు లేనంత రికార్డ్‌ కలెక్షన్లు సాధిస్తోంది అభిమన్యుడు. మొదటి వారాంతాని​కి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. 

అయితే తాజాగా విశాల్‌ ఓ నిర్ణయాన్ని ప్రకటించి రియల్‌ హీరో అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెగిన ప్రతి టికెట్‌పై ఒక్క రూపాయిని ఇక్కడి రైతులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో విశాలో తమిళనాట కూడా ఇదే విధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడ తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు