మా మధ్య ఏం లేదు : విశాల్‌

12 Jun, 2018 13:35 IST|Sakshi

కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్‌. ఇటీవల అభిమన్యుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని నమోదు చేసిన విశాల్ ప్రమోషన్‌ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కోలీవుడ్‌ హీరోయిన్‌, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా కోలీవుడ్‌ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విశాల్ స్పందించాడు.

‘మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు నేను వరలక్ష్మీ మంచి స్నేహితులం, ఒకరి కష్టా సుఖాలు ఒకరం పంచుకుంటాం.. అంతే’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ల రాజకీయ అరగేంట్ర శుభపరిణామం అన్న విశాల్, తాను ఎవరికి మద్దతు తెలిపేది ఇప్పుడే చెప్పలేనన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు