అభిమన్యుడు వస్తున్నాడు

17 May, 2018 05:35 IST|Sakshi
సమంత, విశాల్‌

విశాల్, సమంత జంటగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇరుంబుదురై’. యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర చేశారు. రీసెంట్‌గా తమిళనాడులో విడుదలై, సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఎం. పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి. హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలాఖర్లో రిలీజ్‌ కానుంది. ‘‘తమిళంలో విడుదలైన ‘ఇరుంబుదురై’ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. మంచి రివ్యూస్‌ కూడా వచ్చాయి. ‘రంగస్థలం, మహానటి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన సమంతకు ఈ చిత్రం హ్యాట్రిక్‌ అవుతుంది. తెలుగులో కూడా చాలా పెద్ద హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు హరి. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు