మగాడినంటున్న విశాల్

18 Jul, 2014 09:00 IST|Sakshi
మగాడినంటున్న విశాల్

 చిత్రానికి పేరు చాలా ముఖ్యం. పేరు వినగానే చిత్రం చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో రేకెత్తించాలి. ఈ విషయంలో చాలా మంది ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదనే అపవాదు కోలీవుడ్‌లో ఉంది. నటుడు విశాల్ ఈ విషయంలో ప్రత్యేకమనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన చిత్రాల పేర్లు పరిశీలిస్తే పాండియనాడు, నాన్ శిగప్పు మనిదన్ తాజాగా నటిస్తున్న పూజై అన్నీ క్యూరియాసిటీని కలిగించే విధంగా ఉన్నాయి.
 
 విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాలకు తానే నిర్మాత. హరి దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న పూజై చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి చేపట్టిన చిత్రానికి సంబంధించే విశాల్ మగాడినంటున్నారు. అంటే ఈ చిత్రానికి ఆంబళై అనే టైటిల్‌ను నిర్ణయించారన్నమాట.
 
 ఆంబళై అంటే మగాడు అని అర్థం. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు మదగజరాజా అనే చిత్రం తెరకెక్కింది. మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ విశాల్‌తో రొమాన్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం విశాల్, సుందర్.సి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించనున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా