ఆ నలుగురు

25 Aug, 2018 04:55 IST|Sakshi
షఫీ

షఫీ, ఆయుష్‌ రామ్, శ్రావణి ముఖ్య తారలుగా శ్రీనివాస్‌ సందిరి దర్శకత్వంలో పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డి నిర్మించిన సినిమా ‘విషపురం’. ఈ సినిమాను వచ్చే నెల 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ స్నేహితుని ప్రేమ కోసం జాంబీలు ఉండే గ్రామంలోకి ఓ నలుగురు కుర్రాళ్లు అడుగుపెడతారు. ఆ తర్వాత కుర్రాళ్లు తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. షఫీ పాత్ర కీలకంగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘తెలుగులో ఇలాంటి కథను ఇంత వరకు ఎవరూ చేయలేదు? మనం చేస్తే ఎలా ఉంటుందా? అని  భయపడ్డాం. కానీ డైరెక్టర్‌ని నమ్మి రాజీ పడకుండా నిర్మించాం. టీమ్‌ అంతా కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. యాదవ్‌ రెడ్డి, మల్లేష్‌ యాదవ్, దేవా, రాము తదితరులు నటించిన ఈ సినిమాకు కిషన్‌ ఛాయాగ్రాహకుడు.

మరిన్ని వార్తలు