మోసగాళ్లు

23 Nov, 2019 00:17 IST|Sakshi
మంచు విష్ణు

‘మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లకు ఏ ఢోకా లేదు. కావాల్సిందల్లా పక్కా ప్లాన్‌ మాత్రమే’ అనే ఫిలాసఫీ నమ్మే కుర్రాడు అర్జున్‌. ఓ పెద్ద ప్లాన్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్‌ చేయగలుగుతాడు. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో మంచు విష్ణు హీరోగా తెలుగు–ఇంగ్లీష్‌ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది.

జెఫ్రీ చిన్‌ దర్శకుడు. కాజల్, రుహానీ శర్మ, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ‘మోసగాళ్లు’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఐటీ ఇండస్ట్రీలో జరిగిన స్కామ్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. నేడు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ‘అర్జున్‌’ పాత్రలో కనిపిస్తారు విష్ణు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా