‘పద్మశ్రీ’ చూసి సినిమాకు జనాలొస్తారని అనుకోను!

30 Jan, 2014 23:31 IST|Sakshi
‘పద్మశ్రీ’ చూసి సినిమాకు జనాలొస్తారని అనుకోను!
 ‘‘రాష్ట్రంలో కీలకమైన సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి... అందరూ నాన్నగారి ‘పద్మశ్రీ’ ఇష్యూ మీదే ఎందుకు దృష్టి సారిస్తున్నారో అర్థం కావడంలేదు’’ అని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల అవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 ఈ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా... పేరుకు ముందు ‘పద్మశ్రీ’ అనే అక్షరాల్ని చూసి సినిమాకు జనాలు వస్తారని తాను అనుకోనని, దాని వల్ల తమకు రికార్డులేం సొంతం కావని విష్ణు ఘాటుగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహానటులు నటించిన సినిమాల్లో కూడా టైటిల్స్‌లో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ’  ఉంచేవారు. దాంతో అదేం తప్పుకాదు అనుకున్నాం. కానీ కోర్టు తీర్పు తర్వాత ‘పద్మశ్రీ’ బిరుదు విషయంలో మాకొక క్లారిటీ వచ్చింది. అవార్డు పొందిన వారి పేరు ముందు కానీ, పేరు వెనుక గానీ ‘పద్మశ్రీ’ అని వాడకూడదు. పేరు తర్వాత ‘రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన’ అని వేసుకోవచ్చు. ఇక నుంచి అలాగే చేస్తాం’’ అని చెప్పారు విష్ణు.
 
>