గుత్తా జ్వాలతో డేటింగ్‌పై యంగ్‌ హీరో క్లారిటీ! 

7 Jun, 2019 18:01 IST|Sakshi

హైదరాబాద్‌:  గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్‌ గుత్తా జ్వాలకి తమిళ హీరో విష్ణు విశాల్‌తో ఎఫైర్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్‌గా తీసుకున్న ఫోటోను విష్ణు తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనన్న వార్తలు  మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తా జ్వాలని పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఈ యంగ్‌ హీరో క్లారిటీ ఇచ్చాడు.

తనకు జ్వాల అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే కూడా ఇష్టమని అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం బంధం తప్ప మరే బంధము లేదని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని తెలిపారు. కాగా, ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే సినిమాలో నటిస్తున్నాడు.  

ఇక  గుత్తా జ్వాలా, చేతన్ ఆనంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లుగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో తమ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునేవారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో ఈ జంట విడిపోయింది. ఇ​​క  నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు బిగ్‌బాస్‌ 3లో గుత్తా జ్వాల పార్టిసిపేట్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్‌ వేదికగా కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు