గుత్తా జ్వాల ప్రియుడితో ప్రియా రొమాన్స్‌

5 Jan, 2020 08:19 IST|Sakshi

యువ నటుడు విష్ణువిశాల్‌ ఇంతకుముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమలో మునిగితేలుగున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ ప్రచారం అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణువిశాల్‌ ఇంతకుముందు సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు  దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్‌లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా విష్ణువిశాల్‌ ఈ దర్శకుడికి తాజాగా మరో అవకాశాన్నిచ్చారు. వీరి కాంబినేషన్‌లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌)

కాగా ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి ప్రియాభవానీ శంకర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియాభవానీశంకర్‌ కూడా నటించడానికి సమ్మతించినట్లూ సమాచారం. ఈ చిత్రానికి ఇంకా కాల్‌షీట్స్‌ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియాభవానీశంకర్‌ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్‌ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై. ఇండియన్‌ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణువిశాల్‌ చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయిస్తానని నటి ప్రియాభవానీశంకర్‌ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా  ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు