విసిరి గీతాలావిష్కరణ

23 Nov, 2017 05:48 IST|Sakshi

తమిళసినిమా: నటుడు విజయ్‌ తప్పుడు సమాచారాన్ని చెప్పరాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ.అరసుకుమార్‌ పేర్కొన్నారు.ఈయన తొలిసారిగా విసిరి అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. వెన్నెలావీడు వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తరువాత వెట్ట్రిమహాలింగం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నవ నటుడు రాజసూర్య, రామ్‌సరవణన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి మదన్‌కార్గీ పాటలను, ధన్‌రాజ్‌ మాణిక్యం, శేఖర్‌సాయ్‌భరత్, నవీన్‌ శంకర్‌ల త్రయం సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్, ధనుంజయన్‌ పాల్గొన్నారు. బీజేపీరాష్ట్ర ఉపాధ్యక్షుడు పీటీ.అరసుకుమార్‌ రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నటుడిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో గీతరచయిత మదన్‌కార్గీ పద్మావతి చిత్ర సమస్యను ప్రస్తావిస్తూ రాజకీయ అంశానికి తెర లేపారు. భావ స్వాతంత్య్రం గురించి సినిమా పరిశ్రమలోనే, దేశ వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నారని, ఈ వేదికపై బీజేపీ నాయకుడు ఉండడంతో ఆయనకు చెబితే ప్రధానిమంత్రికు చెప్పినట్లేనని, దయచేసి భావ స్వాతంత్య్రం విషయంలో జోక్యం చేసుకోవద్దని ఒక నోరులేని జీవిగా ఇది తన విజ్ఞప్తి అని అన్నారు. అనంతరం బీజేపీ నాయకుడు పీటీ.అరసకుమార్‌ మాట్లాడుతూ నటుడు విజయ్‌ అంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. విజయ్‌ చెప్పే విషయం కోట్లాదిమంది ప్రజలకు చేరుతుందన్నారు.అలాంటి ఆయన తప్పుడు సమాచారాన్ని తన చిత్రాల ద్వారా చెప్పకూడదని అరసకుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు