విఠల్‌వాడి ప్రేమకథ

24 Sep, 2019 00:26 IST|Sakshi
రోహిత్, జగపతిబాబు, నరేష్‌రెడ్డి

రోహిత్, సుధ రావత్‌ జంటగా టి.నాగేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్‌వాడి’. నరేష్‌ రెడ్డి .జి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విఠల్‌వాడి’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్‌కు అభినందనలు. నిర్మాత నరేష్‌ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి. ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని విఠల్‌వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో మా సినిమా నిర్మించాం.

కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు నరేష్‌ రెడ్డి. జి. ‘‘విఠల్‌వాడి’ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషం. నరేష్‌ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ చిత్రం మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు రోహిత్‌. ‘‘నిజ జీవితంలో జరిగిన ఒక వాస్తవ ప్రేమకథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు టి.నాగేందర్‌. అమిత్, అప్పాజీ అంబరీష్‌ దర్బా, చమ్మక్‌ చంద్ర, జయశ్రీ, రోల్‌ రైడ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ అడపా, సంగీతం: రోషన్‌ సాలూరు.

మరిన్ని వార్తలు