ఆర్టికల్‌ 370 కథ

26 Oct, 2019 00:22 IST|Sakshi
అభిషేక్‌ అగర్వాల్, వివేక్‌ అగ్నిహోత్రి

కాశ్మీర్‌ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’. ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు. అభిషేక్‌ మాట్లాడుతూ– ‘‘ఆర్టికల్‌ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్‌ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్‌ పాత్రల్లో ప్రముఖ నటులు నటిస్తారు. ఆ వివ రాలు త్వరలోనే తెలియజేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా