భారతీయ చిత్రానికి విదేశీ అవార్డు

13 Jul, 2015 09:55 IST|Sakshi
భారతీయ చిత్రానికి విదేశీ అవార్డు

న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రం 'బుద్ధ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్'కు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని రూపొందించారు.

రాజకీయ నాయకులపై వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహీ గిల్, ద్వివేది, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, అరుణోదయ్ సింగ్, వివేక్ విశ్వానివంటి వారు దర్శకత్వం వహించారు. జూలై 2న ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ శనివారం ముగిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా