కరోనాకు మందు కనిపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌!

6 Jul, 2020 16:14 IST|Sakshi

కరోనాకు సంబంధించి సామాజిక భాద్యతగా చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు వీడియోలు ద్వారా తమ అభిమానులకు జాగ్రత్తలు చె‍ప్పారు. వ్యాధినిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని, వ్యాయమం చేయాలని కొంత మంది చెప్పగా,  సెలబ్రెటీలందరూ మాస్క్ పెట్టుకోమని, సామాజిక దూరం పాటించాలని, చేతులు కడుక్కోవాలని చెప్పారు. ఇదిలా వుండగా  దర్శకుడు వివి వినాయక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ‍ఓ ఇంజెక్షన్ గురించి మాట్లాడాడు. కరోనాకు  ఆ ఇంజెక్షన్ తో చెక్‌ పెట్టడం సాధ్యమౌతుందేమో అనే అనుమానం వ్యక్తంచేశాడు.

దీనికి సంబంధించి వివి వినాయక్‌ ఒక వీడియోను విడుదల చేశారు. వినాయక్‌ తెలిపిన ఇంజెక్షన్‌ ఎల్లో ఫీవర్ అనే వ్యాధి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్.దీని గురించి ఆయన మాట్లాడుతూ, "ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం." అని వీవీ వినాయక్‌ అన్నారు. (ఆగిపోయిన వినాయక్‌ ‘సీనయ్య’?)

ఇదిలా వుండగా ఈ మధ్య కరోనా నివారణకు సంబంధించి ఇద్దరు వైద్యులు మాట్లాడుకున​ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో కరోనా వైరస్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఉన్నాయి. ఆ ఆడియో క్లిప్ విన్న వినాయక్ వాళ్లకు తన ఆలోచన చేరాలనే ఉద్దేశంతోనే వీడియో షేర్‌ చేసినట్లు తెలిపారు.  ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని వినాయక్‌ తెలిపారు. అది ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమో ఒకసారి పరీక్షించాలని వినాయక్‌ కోరారు. (చాలెంజ్‌ స్వీకరించిన వివి వినాయక్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు