రాజా వస్తున్నాడహో...

6 Nov, 2019 03:09 IST|Sakshi

మమ్ముట్టి హీరోగా వైశాఖ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధుశేఖర్‌ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్‌ యాప్ట్‌గా ఉంది.

మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్‌ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్‌ఫుల్‌ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీ లియోన్‌ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.    ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు