ఆర్డీఎక్స్‌ లవ్‌ హిట్‌ కావాలి

11 Oct, 2019 02:02 IST|Sakshi
తేజస్‌ కంచెర్ల, వీవీ వినాయక్, పాయల్‌ రాజ్‌పుత్, శంకర్‌ భాను, సి. కల్యాణ్‌

– వినాయక్‌

‘‘ఆర్‌.నారాయణమూర్తిగారికి నేను కనిపించినప్పుడల్లా ‘నువ్వు హీరోగా చెయ్యి బాసూ’ అనేవారు. నేను కూడా మొహమాటానికి చేస్తానని చెప్పేవాణ్ణి. నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారేమో. హీరోగా నా సినిమా ప్రారంభమైంది. నారాయణమూర్తిగారికి  థ్యాంక్స్‌. ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ సినిమా పోస్టర్స్‌ చూస్తుంటనే చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ‘ఆర్‌ఎక్స్‌ 100’ అంత హిట్‌ చేయాలి’’ అన్నారు వీవీ వినాయక్‌. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్, తేజస్‌ కంచర్ల జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’. రామ్‌ మునీష్‌ సమర్పణలో సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి సక్సెస్‌ సాధించడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఆ కష్టమే నన్ను టాప్‌ టెన్‌ హీరోయిన్స్‌లో ఒకర్ని చేసింది. నా కెరీర్‌లో ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ ఓ మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పుట్టడానికి కారణం సత్యనారాయణ, ప్రవీణ్‌లే. ముందుగా ఈ సినిమాకి ‘ట్రిపుల్‌ ఎక్స్‌ లవ్‌’ అనే టైటిల్‌ అనుకున్నాను. పాయల్‌ చాలా గొప్పగా నటించింది’’ అన్నారు సి.కల్యాణ్‌. ‘‘సినిమా ఔట్‌పుట్‌ చూసిన తర్వాత దీన్ని నేనే డైరెక్ట్‌ చేశానా? అనిపించింది. అంత అద్భుతంగా ఈ చిత్రం రావడానికి కారణం సి.కల్యాణ్‌గారు’’ అన్నారు శంకర్‌ భాను. తేజస్‌ కంచర్ల, నటుడు డా.వి.కె.నరేశ్, నటి తులసి, సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు