ఈ క్షణం.. ఓ హైలైట్‌

6 Jan, 2019 03:36 IST|Sakshi
విశ్వనాథ్‌ తన్నీరు, వినాయక్, ధ్రువ

ధ్రువ, అశ్విని జంటగా జైరామ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్‌ 6’. విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు  ఎంజాయ్‌ చేస్తారు. ఎక్కడా బోర్‌ ఫీల్‌ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్‌ 6’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది.

మా చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్‌ బెంగళూరు అశ్విని హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు  సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా