సల్మాన్‌ బాధంతా ఆమె గురించే..

9 Apr, 2018 09:48 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌తో ఆమె తల్లి సుశీలా చరక్‌, తండ్రి సలీం ఖాన్‌(పాత చిత్రం)

రాజస్తాన్‌: జోధ్‌పూర్‌ సెంట్రల్లో ఉన్న సమయంలో బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఎక్కువగా తన తల్లి గురించే బాధపడేవాడని రాజస్థాన్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   ఈ నడుమ సల్మాన్‌ ఖాన్‌ తల్లి సుశీలా చరక్‌ అలియాన్‌ సల్మా ఆరోగ్యం బాగాలేదని, సల్మాన్‌ ఖాన్‌ జైలులో ఉన్నట్లు తెలిస్తే ఆమెకు ఇంకా బాధ ఎక్కువైపోతుందనే సల్మాన్‌ డీలా పడిపోయాడని స్థానిక జైళ్ల శాఖ డీఐజీ విక్రమ్‌ సింగ్‌ కర్ణావత్‌ తెలిపారు. సల్మాన్‌ ఖాన్‌ జైలుకు వచ్చిన సమయంలో కొంచెం ఆందోళనకు గురయ్యాడని, ఆ తర్వాత కుదురుకున్నాడని ఆయన తెలిపారు.సల్మాన్‌ ఖాన్‌ను కలిసేందుకు చాలా మంది సందర్శకులు వచ్చేవారని, కానీ సల్మాన్‌ వారందరినీ కలిసేందుకు అంత ఆసక్తి చూపించలేదని డీఐజీ తెలిపారు.

‘ జైలులో రోజూ ఉదయం అల్పాహారం చేసి జైలు గదిలో తిరిగేవాడు. సల్మాన్‌కు నాలుగు దుప్పట్లు ఇచ్చాం. కసరత్తుల కోసం ఎలాంటి పరికరాలు ఆయన అడగలేదు. కేవలం ఫ్లోర్‌ను మాత్రమే ఉపయోగించేవాడు’  అని విక్రం సింగ్‌ తెలిపారు.

‘  మొదటి రోజు సల్మాన్‌ తరపు న్యాయవాదులు వచ్చి ఆయనను కలిశారు. తర్వాత సినీ నటి ప్రీతి జింతా, ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్‌లు ఆయనను సందర్శించారు. సల్మాన్‌కు బెయిల్‌ వచ్చిన తర్వాత మొదటగా ఆయన తన తల్లి సుశీలా చరక్‌కు ఫోన్‌ చేశారు’ అని విక్రం సింగ్‌ వివరించారు.

‘  సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ వచ్చిన విషయం చెప్పగానే ఆయన ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు. వెంటనే స్నానం చేసి తన దుస్తులు ప్యాక్‌ చేసుకున్నారు’ అని డీఐజీ తెలిపారు.

‘ సల్మాన్‌ ఖాన్‌ను కలిసేందుకు పలువురు ఖైదీలు ఉత్సాహం చూపేందుకు ప్రయత్నించడంతో ఆయన సెక్యూరిటీ పాయింట్‌ వద్ద నుంచే చేతులు ఊపుతూ గ్రీట్‌ చేశారు. అలాగే జైలు నిబంధనలు ఉల్లంఘించవద్దని, డీఐజీని ఇబ్బందిపెట్టవద్దని ఖైదీలను సల్మాన్‌ సూచించారు’  అని డీఐజీ విక్రం చెప్పారు.

సల్మాన్‌ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు ఈ నెల 5 న ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెల్సిందే. రెండు రోజులు జైలులో గడిపిన అనంతరం ఈ నెల 7న  కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు