'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..

11 Aug, 2016 18:27 IST|Sakshi
'రుస్తుం' కోసం అలియా డ్యాన్స్..

ఆగస్టు 12 న విడుదల కానున్న అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తారల్లో కూడా ఆ మానియా ఊపందుకుంది. అక్షయ్ రుస్తుం సినిమా విడుదలకు ఆత్రుతతో ఎదురుచూస్తున్న విషయాన్ని యువతార అలియా భట్ కళాత్మకంగా తెలిసింది. అక్షయ్, రవీనాల హిట్ సినిమా 'మొహ్రా'లో కుర్రకారును ఊపేపిన వాన పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్తోపాటు అక్షయ్ను కూడా ఫిదా చేసింది ఉడ్తా పంజాబ్ స్టార్.

ఆ పాటలో రవీనా కట్టుకున్న పసుపు రంగు చీరనే ధరించి.. అచ్చంగా ఆమెలానే డ్యాన్స్ చేసింది అలియా. తన తల మీద నేవల్ ఆఫీసర్స్ క్యాప్ను ధరించి 'రుస్తుం' సినిమాను ప్రమోట్ చేసింది.  ఈ సినిమాలో అక్షయ్ తొలిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ వీడియోను చూసిన అక్షయ్.. ఇక నుంచి నా ప్రతి సినిమాలో ఓ వాన పాట తప్పనిసరి అవుతుంది, సూపర్బ్ అలియా అంటూ ట్వీట్ చేశారు. అలియా అభిమానులైతే ఆ వీడియోను షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి