తలకిందుల తపస్సు

2 May, 2018 01:04 IST|Sakshi

ఏదైనా కష్టతరమైన పనిని ఉదహరించేప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పని పూర్తవ్వదు అంటుంటారు. తపస్సు సంగతి సరే.. తలకిందులుగా కొద్దిసేపు ఆసనమేయడం కష్టం. అవును.. కష్టమే అంటున్నారు అమలా పాల్‌. యోగాని ఉద్దేశించి ఆమె చెప్పిన మాట ఇది. యోగాలో శీర్షాసనమేయడం చాలా కష్టమని, ఆ ఆసనం నేర్చుకోవడానికి చాలా రోజులు పట్టిందనీ అంటున్నారు అమలా. ‘‘యోగా ప్రస్తుతం మనం ఎక్కడున్నాం అనే దగ్గరి నుంచి మొదలవుతుంది. నిన్న ఎక్కడున్నాం, లేదా రేపెక్కడుంటాం అన్న దగ్గర కాదు. ప్రజెంట్‌ మూమెంట్‌లో ఉండటాన్ని నేర్పుతుంది యోగా. ఈ ఆలోచనే రోజూ నన్ను యోగా మ్యాట్‌ (చాప) దగ్గరకు తీసుకువెళ్తుంది. కొంచెం కష్టమైనా శీర్షాసనం కోసం కొన్ని రోజులుగా కష్టపడుతున్నాను.

నా అప్పర్‌ బాడీ కొంచెం వీక్‌గా ఉండటంతో టీచర్‌ సాయంతోనో లేదా గోడ ఆసరాగా చేసుకొనో ఆసనం వేయగలుగుతున్నాను. స్టార్టింగ్‌ స్టేజ్‌లో చాలా కష్టంగా ఉండేది. స్ట్రెస్‌గా అనిపించేది. ఈ హార్డ్‌వర్క్‌ చేయకపోతే బాడీని స్ట్రాంగ్‌గా తయారు చేసుకోలేనని తెలుసు. అందుకే ప్రయత్నించా. ఫైనల్‌గా నా తల మీద నేను నిల్చోగలిగాను. శీర్షాసనం వేయగలిగాను. అలా ఎంతసేపు ఉన్నానో తెలీదు కానీ మళ్లీ నార్మల్‌ పొజిషన్‌కి వచ్చాక కంట్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో చిన్న పిల్లలా పార్క్‌ అంతా తిరిగేశాను’’ అని అమలాపాల్‌ పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు