'వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. మేమంతా ఒక్కటే'

18 Oct, 2015 17:33 IST|Sakshi
'వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. మేమంతా ఒక్కటే'

హైదరాబాద్: అన్నయ్య, తాను వేర్వేరు పార్టీల్లో ఉన్నా తామంతా ఒక్కటేనని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవిని ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను వెళుతానో లేదో ఇప్పుడు చెప్పలేనన్నారు. తనకు వెళ్లాలని ఉన్నా షూటింగ్ షెడ్యూల్, డేట్స్ వల్ల ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు. సినిమాలపరంగా తామంతా ఒకటేనని తెలిపారు.
 

అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి రావడం ఆనందం కలిగించిందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నయ్యను కొన్నిసార్లే కలుసుకున్నానని చెప్పారు. రాజకీయంగా తమ విధానాలు వేరైనాకానీ.. సినిమాలపరంగా, కుటుంబపరంగా అన్నయ్య అంటే గౌరవమని తెలిపారు. మీరిద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు నాడు శంకర్ దాదా సినిమాలో యాదృచ్ఛికంగానే నటించానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా తాను నిర్మించబోయే సినిమా కోసం రెండు, మూడు కథలను పరిశీలించామని చెప్పారు.  'సర్దార్ గబ్బర్సింగ్'  సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి