'వుయ్ లవ్ యూ ధోని'

25 Mar, 2016 08:18 IST|Sakshi
'వుయ్ లవ్ యూ ధోని'

బెంగళూరు: 'రీల్' ధోని సుశాంత్ సింగ్ రాజపుత్ రియల్ ధోనిని కలిశాడు. అంతేకాదు అతడితో కలిసి ఫొటో దిగి తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. టీమిండియా నాయకుడు 'మిస్టర్ కూల్'పై ప్రశంసలు కురిపించాడు. ధోని జీవితంపై వంద సినిమాలు తీసినా సరిపోవని అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో ధోని ఒకడని కితాబిచ్చాడు. ధోని గొప్ప వ్యక్తి అని, అతడంటే తనకెంతో ఇష్టమని ట్వీట్ చేశాడు.

టీ20 ప్రపంచకప్ లో బుధవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి కూడా సుశాంత్ కామెంట్లు పోస్ట్ చేశాడు. క్రికెట్ అంటే ఇలా ఆడాలని పేర్కొన్నాడు. టెన్షన్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా అభినందనలు తెలిపారు. ధోని అంటే తమకెంతో ఇష్టమని పునరుద్ఘాటించాడు. ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో సుశాంత్ హీరోగా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి