నేను బొమ్మ గీస్తే..!

26 Jun, 2019 00:09 IST|Sakshi

‘‘సినిమాలో పాత్ర పండటం కోసం ఏదేదో చేస్తాం. ఫైట్‌ చేస్తాం, వంట చేస్తాం, గయ్యాళిలా ప్రవర్తిస్తాం.. ఇలా పాత్రకు తగ్గట్టు చేస్తాం. అవన్నీ రియల్‌ లైఫ్‌లో చేయం. అసలు సినిమాల్లో కనిపించే మేం వేరు.. రియల్‌ లైఫ్‌లో మేం వేరు’’ అంటున్నారు తమన్నా. ఎందుకు ఇలా అంటున్నారంటే.. ఆ మధ్య విడుదలైన ‘అభినేత్రి 2’లో ఈ మిల్కీ బ్యూటీ పెయింటర్‌ పాత్ర చేశారు. మరి.. నిజజీవితంలో మీకు బొమ్మలు గీయడం వచ్చా? అని అడిగితే – ‘‘నేనా? బొమ్మలు గీయడమా? రానే రాదు.

చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాను (నవ్వుతూ). నాకెవరైనా ఖాళీ కాగితం ఇచ్చి, బొమ్మలు గీయమంటే.. ఓ సర్కిల్‌ (వలయం) గీసి, దానికి రెండు కాళ్లు, రెండు చేతులు గీయగలను. అవేముంది? జస్ట్‌ గీతలే కదా. నా బొమ్మలో ఆ గీతలే కాళ్లూ చేతులు. ఆ బొమ్మ బొమ్మలా ఉండదు. అయితే నాకు కవితలు రాయడం బాగా వచ్చు. షూటింగ్‌ లేనప్పుడు కవితలు రాస్తుంటాను’’ అని చెప్పారు. చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా  ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది నెగటివ్‌ రోల్‌ అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే అది నిజం కాదని సమాచారం.

మరిన్ని వార్తలు