మీ శరీరాన్ని ప్రేమించండి

15 Apr, 2018 00:49 IST|Sakshi
పూజా హెగ్డే

లుక్స్‌ పై కామెంట్స్, బాడీ షేమింగ్‌ వంటివి ప్రతిరోజూ సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీలు దాకా ఎదుర్కొంటూనే ఉంటారు. కొందరు అమ్మాయిలు ఇలాంటి మాటలకు కుంగిపో తుంటారు. కానీ ధైర్యవంతులు ఈ కామెంట్స్‌ అన్నీ పట్టించుకోకుండా,  వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు.  తమ శరీరాకృతి ఎలా ఉన్నా ప్రేమిస్తుంటారు.  అలా కుంగిపోకుండా  తమ శరీరాన్ని ప్రేమించేవాళ్లందర్నీ పూజా హెగ్డే అభినందిస్తున్నారు. మన శరీరాన్ని మనం ప్రేమించాలంటున్నారామె. 

ఈ విషయం పై పూజా హెగ్డే స్పందిస్తూ – ‘‘ఎవరెన్ని విధాలుగా విమర్శించినా తమ శరీరాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్న అమ్మాయిలందరికీ కంగ్రాట్స్‌. అలా ఉండొద్దూ, ఇలా ఉండొద్దూ  అని  చెప్పేవాళ్లు, మన శరీరాకృతిని విమర్శించేవారే ఎక్కువగా ఉంటారు. వాళ్ల మాటల్ని  అస్సలు పట్టించుకోవద్దు. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. బికినీ వేసుకోండి. మీ శరీరం ఎలా ఉన్నా గర్వంగా ఫీల్‌ అవ్వండి. మన శరీరాన్ని మనం ప్రేమించడం కంటే మించిన రివల్యూషన్‌ ఇంకోటి లేదు. హేట్‌ చేసుకునే వాళ్లను హేట్‌ చేసుకోనివ్వండి. వాళ్ల వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు. మీకు నచ్చినట్టు ఉండడానికి సంకోచించకండి. కాన్ఫిడెన్స్‌ ఈజ్‌ సెక్సీ’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు