‘బచ్చన్' టార్గెట్ ఏంటి

9 Apr, 2014 23:21 IST|Sakshi
‘బచ్చన్' టార్గెట్ ఏంటి

‘ఈగ' ఫేం సుదీప్ హీరోగా, జగపతిబాబు కీలక పాత్రలో రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్' అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. ఉదయ్ కె. మెహతా సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్నిఅనువదిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రచార చిత్రాలను దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ -‘‘బచ్చన్ ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే. జగపతిబాబు చేసిన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యాక్షన్, సస్పెన్స్, సెంటిమెంట్ సమాహారంగా సాగే ఈ సినిమా కన్నడంలో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో చదలవాడ శ్రీనివాసరావు, అల్లాణి శ్రీధర్, అజయ్‌కుమార్, సుంకు రమేష్, సజ్జు తదితరులు పాల్గొన్నారు.