మగువ మందు కొడితే...

17 Jul, 2014 01:10 IST|Sakshi
మగువ మందు కొడితే...

యువతపై సినిమా ప్రభావం చాలానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అందుకే సాధ్యమైనంత వరకు నవ తరాన్ని పెడదోవ పట్టించే మద్యపానం లాంటి సన్నివేశాలను చిత్రాల్లో లేకుండా చూడాలని, విజ్ఞులు, పలు సంక్షేమ సంఘాలు ఘోషిస్తున్నాయి. అలాంటిది నటి ప్రియా ఆనంద్ మగువ మద్యం తాగేలా నటిస్తే తప్పా? అంటూ ప్రశ్నిస్తోంది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఈ అమ్మడు నటిగా పలు పోరాటాలు చేసిన తరువాత హీరోయిన్‌గా విజయాల బాట పట్టింది. ఎదరి నీశ్చల్, వణక్కం చెన్నై చిత్రాల్లో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల విడుదలైన అదిమానం చిత్రంలో విక్రమ్ ప్రభుతో జతకట్టింది.

చిత్రం విజయబాటలోనే పయనిస్తోంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ జాణ చిత్రంలో మద్యాన్ని కాక్‌టైల్‌లో ఫుల్‌గా తాగి మబ్బులో తేలిపోయేలా నటించేసింది. దీంతో పలువురు అమ్మడిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అలా మద్యం తాగే సన్నివేశంలో నటించడానికి కారణమేమిటన్న ప్రశ్నకు ప్రియా ఆనంద్ బదులిస్తూ కథకు అలాంటి సన్నివేశం అవసరం అయ్యిందని చెప్పుకొచ్చింది.

మద్యం తాగుతున్నట్లు నటిస్తేనే మనం చెప్పదలచుకున్న విషయం బలంగా చేరుతుందని దర్శకుడు అన్నారని చెప్పింది. అందువలనే తనలా నటించానని వివరించింది. అయితే ఒక అమ్మాయి మద్యం తాగేలా నటించవచ్ఛా? అని అడుగుతున్నారని ఒక మగువ అలా నడుచుకోవడం వలనే సంస్కృతి, సంప్రదాయాలు మంటకలుస్తాయనడాన్ని తాను అంగీకరించనని ప్రియా ఆనంద్ పేర్కొంది. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు ఎంతో మంది హీరోరుున్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించారని గుర్తు చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి