ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

10 Aug, 2019 15:28 IST|Sakshi

సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు అంటే చాలు.. చాలా మంది నటులు పెద్దగా ఉత్సాహం చూపరు. కొందరు సినిమా అంగీకరించడానికి ముందే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో తాము పాల్గొనమని ఒప్పందం చేసుకుంటారు. కానీ బాలీవుడ్‌ ఖిలాడీ హీరో అక్షయ్‌ కుమార్‌ మాత్రం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. తోటి నటులతో కూడా చాలా సరదాగా ఉంటారు. ప్రస్తుతం అక్షయ్‌ అండ్‌ టీమ్‌ మిషన్‌ మంగళ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్‌ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

హీరోయిన్‌ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ని కింద పడేసింది. ‘మిషన్‌ మంగళ్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరోయిన్లు నిత్యా మీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా, అక్షయ్‌ కుమార్‌ హాజరయ్యారు. వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్షయ్‌ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అక్షయ్‌ ఛాతిపై చేత్తో కొట్టింది. దాంతో అక్షయ్‌ కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. అక్షయ్‌ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది.

అక్షయ్‌ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది అన్నట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్‌ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. జగన్‌ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. భారతదేశం చేసిన మిషిన్‌ మార్స్‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు